ఎర్టిగా ఎమ్‌పివి: ఇండియా కన్నా ముందు జపాన్‌లోనే విడుదల?

మనదేశంలో జనవరి 2012లో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి తమ ఎర్టిగా ఎమ్‌పివిను విడుదల చేయనుంది. ఆర్3 కాన్సెప్ట్ పేరుతో మారుతి సుజుకి గడచిన (2011) ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలోనే కంపెనీ ఈ ఎమ్‌పివి ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం ఈ మోడల్‌ను దేశీయ రోడ్లపై కంపెనీ పరీక్షిస్తోంది.
మారుతి సుజుకి గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్ అయిన రిట్జ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, కొత్త స్విఫ్ట్‌లో ఉపయోగించిన కొన్ని విడిభాగాలతో ఎర్టిగా ఎమ్‌పివిని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఎర్టిగాను భారత్‌లోనే కాకుండా జపాన్‌లో కూడా ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.
టాప్ కార్ మేకర్స్ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉన్న సుజుకి (మారుతి సుజుకి మాతృసంస్థ) మన మార్కెట్ కన్నా ముందుగా జపాన్ మార్కెట్లో ఎర్టిగా ఎమ్‌పివి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అక్కడి మార్కెట్లో కూడా టొయోటా ఎమ్‌పివిలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications