మారుతి సుజుకి ఎస్టిలో కారుపై రూ.35,000 డిస్కౌంట్!

Maruti Suzuki Estilo
కొత్త సంవత్సరం రావడానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు ఆటో కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. దసెరా, దీపావళి వంటి పండుగ సీజన్లలో సైతం డిస్కౌంట్లను ప్రకటించిన మారుతి సుజుకి డీలర్లు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తున్నారు.

ఇందులో భాగాంగానే, కంపెనీ నుండి లభిస్తున్న ఎస్టిలో హ్యాచ్‌బ్యాక్ కారుపై రూ.35,000 తగ్గింపును, రూ.17,000 ఎక్సేంజ్ బోనస్‌ను కంపెనీ డీలర్లు ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం (డిస్కౌంట్ అనంతరం) మారుతి సుజుకి ఎస్టిలో హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ.2.75 లక్షలుగా ఉంది. డిస్కౌంట్‌కు మునుపు దీని ధర రూ.3.27 లక్షలుగా ఉంది. త్వరపడండి, ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే.

మారుతి సుజుకి ఎస్టిలో లభిస్తున్న అన్ని వేరియంట్లరపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. డిస్కౌంట్ అనంతరం వివిధ వేరియంట్లలో లభించే ఎస్టిలో ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

- మారుతి సుజుకి ఎస్టిలో ఎల్ఎక్స్ - రూ.2,75,272
- మారుతి సుజుకి ఎస్టిలో ఎల్ఎక్స్ఐ - రూ.3,06,063
- మారుతి సుజుకి ఎస్టిలో విఎక్స్ఐ - రూ.3,33,520
- మారుతి సుజుకి ఎస్టిలో విఎక్స్ఐ ఏబిఎస్ - రూ.3,62,065

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Maruti Suzuki year end sale is back. Now Maruti Suzuki dealers are offering a cash discount of Rs. 35,000 and an exchange bonus of Rs. 17,000 on the Estilo hatchback. After this discount Estilo price stands at Rs. 2.75 lakh from the earlier Rs. 3.27 lakh.
Story first published: Wednesday, December 7, 2011, 12:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X