మారుతి సుజుకిలో ఉద్యోగాల వెల్లువ..!

Jobs in Maruti
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) భారీ స్థాయిలో ఉద్యోగుల నియామకాలను చేపట్టనుంది. మానేసర్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లు మరియు ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) కోసం రానున్న రెండేళ్లలో 2,300 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. కొత్త నియామకాల ద్వారా మారుతి తన శ్రామిక బలాన్ని (వర్క్‌ఫోర్స్) 27 శాతానికి (దాదాపుగా 11,000 మంది ఉద్యోగులు) పెంచుకోవాలని భావిస్తోంది.

"ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 1,500 మందిని నియమించుకోనున్నాం. వీరిని తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్), మార్కెటింగ్, సప్లయ్ చైన్ మరియు ఆర్ అండి డి విభాగాల్లో నియమించుకోనున్నామ"ని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్) ఎస్ వై సిద్ధిక్వి తెలిపారు. మానేసర్ ప్లాంటులో ఏర్పాటు చేస్తున్న రెండు కొత్త ప్లాంట్ల కోసం 2.5 లక్షల పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఒక్కో ప్లాంటు ద్వారా సాలీనా 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తిని సాధించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన నియామకాలే కాకుండా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2012-13)లో మానేసర్‌లోనే ఏర్పాటు చేయనున్న మూడో ప్లాంటు కోసం కూడా దాదాపు 750 మంది ఉద్యోగులను నియమించుకోనున్నామని సిద్ధిక్వి తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, August 11, 2011, 16:53 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki India said it will hire at least 2,300 people in coming two years. This latest recruitment mainly for its upcoming two new plants in Manesar on board for different verticals like manufacturing, marketing, supply chain and R&D, company Managing Executive Officer (Administration) S Y Siddiqui said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+