రానున్న రెండేళ్లలో 2,300 ఉద్యోగుల నియామకం: మారుతి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,500 మందిని నియమిమచనున్నామని, వీరిని తయారీ, మార్కెటింగ్, సప్లయ్ చైన్, ఆర్ అండ్ డి వంటి వివిధ హోదాల్లో తీసుకుంటామని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్) ఎస్ వై సిద్దిక్ వెల్లడించారు. మానేసర్ ఉత్పత్తి కేంద్రంలో 3,625 కోట్ల రూపాయల పెట్టుబడితో సాలీనా 2.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్న రెండు ప్లాంట్లను నిర్మిస్తున్నట్లు మారుతి పేర్కొంది. ఈఏడాది అక్టోబర్-సెప్టెంబర్ నాటికి మానేసర్‌లోని రెండవ యూనిట్‌ను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఇకపోతే మూడో యూనిట్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తుంది.


Click it and Unblock the Notifications








