దేశీయ కార్ల అమ్మకాల్లో బోర్లాపడిన టాప్ 3 కంపెనీలు

Car Sales
కార్ల కంపెనీలకు ఆగస్టు నెల కూడా పెద్దగా కలిసిరాలేదు. ఆగని వడ్డీ రేట్లు పరుగు, దిగిరాని ఇంధన ధరలకు తోడు ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మందకొడి పరిస్థితులు భారత ఆటో పరిశ్రమ ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలయిన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ అమ్మకాలు ఆగస్టు నెలలో కూడా ఆకట్టుకోలేకపోయాయి.

గడిచిన ఆగస్టు నెలలో భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి అమ్మకాలు కేవలం 91,442 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యి 12.74 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ అమ్మకాలు 1,04,791 యూనిట్లుగా ఉన్నట్లు మారుతి పేర్కొంది.

కాగా.. దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఆగస్టు నెల అమ్మకాలలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే ఈ ఆగస్టు నెలలో హ్యుందాయ్‌ దేశీయ అమ్మకాలు 6.7 శాతం క్షీణించి 28,601 యూనిట్ల నుంచి 26,677 యూనిట్లకు పడిపోయాయి. ఎగుమతులతో కలిపి కంపెనీ అమ్మకాలు 50,633 యూనిట్ల నుంచి 51,030 యూనిట్లకు పెరిగి 1 శాతం వృద్ధిని కనబరిచింది.

ఇకపోతే మరో ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఆగస్టు 2011 నెల దేశీయ అమ్మకాలలో 34 శాతం క్షీణతను నమోదు చేసుకు 17,898 యూనిట్లను మాత్రమే (16,829 టాటా + 1,069 ఫియట్) విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ మొత్తం దేశీయ ప్యాసింజర్ అమ్మకాలు 27,024 యూనిట్లను (25,212 టాటా + 1,812 ఫియట్) విక్రయించగలిగింది. అయితే, దేశీయ మరియు అంతర్జాతీయ అమ్మకాలను కలిపినప్పటికీ టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు 3 శాతం క్షీణించి 64,078 యూనిట్లుగా అమ్ముడయ్యాయి.

More from DriveSpark

Article Published On: Friday, September 2, 2011, 10:37 [IST]
English summary
India's top 3 automobiles companies Maruti Suzuki, Hyundai and Tata Motors report a big drop in sales for the month of August 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+