స్విఫ్ట్ ఉత్పత్తి వేగవంతం; సమ్మె నష్టం రూ.660 కోట్లు!

New Swift
మారుతి సుజుకి బెస్ట్-సెల్లింగ్ కారు కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తి వేగవంతమైంది. గతనెలతో పోలిస్తే.. ఇది 40 శాతానికి పైగా పెరిగింది. మానేసర్ ప్లాంటులో నెల రోజులకు పైగా జరిగిన సమ్మె సద్దుమణగడంతో ఈ ప్లాంటులో సోమవారం నుండి పనులు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ సమ్మె కారణంగా కంపెనీ సుమారు 660 కోట్ల రూపాయలను నష్టపోయినట్లు తెలుస్తోంది.

కాగా.. ఈ సమ్మె కారణంగా మారుతి గతంలో స్విఫ్ట్ ఉత్పత్తిని పాక్షికంగా గుర్గావ్ ప్లాంటుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం స్విఫ్ట్ ఉత్పత్తిని పూర్తిగా మానేసర్ ప్లాంటులోనే చేపట్టాలని కంపెనీ నిర్ణయించింది. మరికొద్ది వారాల్లోనే మానేసర్‌లో ప్రారంభించిన రెండవ ప్లాంటులో పూర్తిస్థాయి ఉత్పత్తిని చేపట్టనుంది. ఈ రెండు ప్లాంట్ల సాయంతో నెలకు 17,000 స్విఫ్ట్ కార్లను ఉత్పత్తి మారుతి సాధించనుంది.

గతంలో స్విఫ్ట్ ఉత్పత్తి ప్రతినెలా 12,000 యూనిట్లుగా ఉండేది. మారుతి సుజుకి ఈ ప్లాంటులో ఎస్ఎక్స్4, ఏ-స్టార్ మోడళ్ల ఉత్పత్తిని కూడా పునఃప్రారంభించనుంది. ప్రస్తుతం స్విఫ్ట్‌కు లక్షకు పైగా బుకింగ్‌లు ఉన్నాయి. స్విఫ్ట్ ఉత్పత్తి వేగవంతం కావడం పట్ల డీలర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 4, 2011, 10:57 [IST]
English summary
Country's largest carmaker Maruti Suzuki India (MSI) will increase Swift production at Manesar plant due to end of a month-long labour unrest at the plant. This strike caused the Company a loss of Rs 660 crore. Dealers are expecting the waiting period of new Swift will come down.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+