మారుతి సుజుకి వృద్ధిలో కె-మ్యాజిక్ చేసిన అద్భుతం

Maruti Suzuki K-magic
మారుతి సుజుకి కె-మ్యాజిక్ వల్ల కంపెనీ అనూహ్య వృద్ధిని సాధించింది. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అందిస్తున్న కె-సిరీస్ ఇంజన్లు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. ఈ ఇంజన్ కారణంగా ఎస్టిలో వంటి మోడళ్లలో 25 శాతానికి పైగా వృద్ధిని సాధించడమే కాకుండా ఆల్టో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్ మోడళ్లను మరింత బలపరచాయి. ఆల్టో 47 శాతం వృద్ధిని సాధించగా, వ్యాగన్ ఆఱ్ 12.5 శాతం, స్విఫ్ట్ 21 శాతానికి పైగా మరియు డిజైర్ 29 శాతానికి పైగా వృద్ధిని కనబరచాయి.

తొలుత ఏ-స్టార్ మోడల్ కార్ల ద్వారా కె-సిరీస్ ఇంజన్లను అందించిన మారుతి సుజుకి, ఈ ఇంజన్‌కు అనూహ్య స్పందన రావడంతో ఇతర మోడళ్లకు కూడా దీనిని వర్తింప చేసింది. అక్టోబర్ 2008లో ప్రారంభమైన కె-సిరీస్ ఇంజన్లు కేవలం 29 నెలల్లోనే 8,50,000 పైగా తయారయ్యంటే వీటికున్న క్రేజే ఏంటో ఇట్టే అర్థమవుతోంది. కె-సిరీస్ ఇంజన్లను గుర్గావ్‌లోని మూడు ప్లాంట్లలో కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ప్రతి నెలా దాదాపు 70,000 కె-సిరీస్ ఇంజన్లను మారుతి ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి రెండు రకాల కె-సిరీస్ ఇంజన్లను తయారు చేస్తుంది.

కె10 (K10) : 998 సీసీ త్రీ-సిలిండర్ కె సిరీస్ ఇంజన్ 'K10' ఇంజన్‌ను ఏ-స్టార్, ఎస్టిలో మరియు వ్యాగన్ఆర్ కార్లలో అందిస్తుంది. ఈ ఇంజన్ 68ps @ 6200 rpm శక్తిని 90nm @ 3500 rpm టార్క్‌ను విడుదల చేస్తుంది. కె-సిరీస్ ఇంజన్‌లో ఉన్న బెస్ట్ ఫీచర్ మైలేజ్. ఆల్టో కె10లో ఉపయోగించే కె-సిరీస్ ఇంజన్ లీటరుకు 20.2 కి.మీ. మైలేజ్‌ను, అలాగే ఏ-స్టార్ లీటరుకు 19 కి.మీ. మైలేజ్‌ను మరియు ఎస్టిలో లీటరుకు 19 కి.మీ. మైలేజ్‌ను అందిస్తుంది.

కె12 (K12) : రిట్జ్, స్విఫ్ట్ మరియు స్విఫ్ట్ డిజైర్ మోడళ్లలో ఉపయోగించే కె-సిరీస్ 'K12' ఇంజన్ 1.2 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ బరువును తగ్గించేందుకు గానూ దీని తయారీలో ప్లాస్టిక్‌ను ఉపయోగించారు. లైట్-వెయిట్ మరియు సుపీరియర్ టెక్నాలజీల కారణంగా కె12 ఇంజన్ రిట్జ్‌లో లీటరుకు 17.9 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌ను, స్విఫ్ట్ మరియు స్విఫ్ట్ డిజైర్‌లలో 17.7 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌ను ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 4, 2011, 16:50 [IST]
English summary
The celebrated K-series engine first offered on A-star has proved magical for many other Maruti Suzuki offerings as well. As an outcome, the models have grown significantly adding to the overall growth story and become bestsellers in their categories.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+