ఫిబ్రవరిలో భారత రోడ్లపై పరుగులు తీయనున్న కిజాషి

హోండా ఎకార్డ్, టొయోటొ క్యామ్రీ, హోండా సివిక్, వోల్క్స్‌వ్యాగన్ జెట్టా, టొయోటొ కరోలా వంటి కార్లకు పోటీగా కిజాషి నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. కిజాషి ధరను రూ. 12 నుంచి రూ. 20 లక్షల మధ్య ఉంటుందని, ఎ4, ఎ5 సెగ్మెంట్‌లో అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నందున కిజాషికి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ సెగ్మెంట్‌లలో ఏడాదికి 55,000లకు పైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. మారుతి సుజుకి కిజాషి 2.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ సామర్ధ్యం కలిగి ఉండి, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ల సదుపాయాలతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








