ఎస్ఎక్స్4లో డీజిల్ వేరియంట్‌ను ఆవిష్కరించిన మారుతి

Maruti Suzuki SX4
దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఇండియా (ఎమ్ఎస్ఐ) అందిస్తున్న ఎస్ఎక్స్4 సెడాన్‌లో డీజిల్ వేరియంట్‌ను మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ఉపయోగించిన కొత్తతరం డీజిల్ టెక్నాలజీ వల్ల ఎస్ఎక్స్4 డీజిల్ అధిక పవర్, పెర్ఫార్మెన్స్‌లను కలిగి ఉండి తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుందని ఎమ్ఎస్ఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ షింజో నకానిషి వివరించారు.

మారుతి సుజుకి ఎస్ఎక్స్4లో ఇప్పటి వరకూ పెట్రోల్ వేరియంట్ మాత్రమే లభిస్తుండేది. కాగా ఇదే విభాగంలో ఎస్ఎక్స్4కు పోటీ ఇస్తున్న వోక్స్‌వ్యాగన్ వెంటో, ఫోర్డ్ ఫియస్టాలు డీజిల్ వేరియంట్లు అత్యధికంగా అమ్ముడవుతుండటంతో ఈ పోటీని తట్టుకునేందుకు ఎస్ఎక్స్4లో మారుతి డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 7.74 - రూ. 8.62 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

మారుతి సుజికి అందిస్తున్న ఇతర డీజిల్ కార్ల కన్నా ఇది ఎక్కువ విజయాన్ని సాధించగలదని కంపెనీ అంచనా వేస్తుంది. స్విఫ్ట్, డిజైర్, రిట్జ్‌లు మారుతి అందిస్తున్న ఇతర డీజిల్ వేరియంట్లు. ఇకపోతే మారుతి సుజికి ఎస్ఎక్స్4 డీజిల్ కారు మైలేజ్ విషయానికి వస్తే.. ఇది లీటరు డీజిల్‌కు 21.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇతర కార్లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం. ఇంకా ఎస్ఎక్స్4 పెట్రోల్, సిఎన్‌జి వేరియంట్లలో కూడా లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 22, 2011, 16:49 [IST]
English summary
The country's largest car-maker Maruti Suzuki India on Tuesday launched a diesel variant of its SX4 sedan at an introductory price of Rs 7.74-8.62 lakh (ex-showroom, Delhi). The company expects the new variant to be as successful as other diesel cars from MSI.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+