కొత్త స్విఫ్ట్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన మారుతి సుజుకి

సరికొత్త ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ కారు కోసం కంపెనీ మరియు దాని సప్లయర్లు రూ. 500 కోట్లకు పైగా పెట్టబడులను వెచ్చించారు. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ షింజో నకనిషి మాట్లాడుతూ.. "ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్విఫ్ట్‌కు మంచి డిమాండ్ ఉన్న తరుణంలోనే కొత్త స్విఫ్ట్‌ను మేము విడుదల చేశాం. అభివృద్ధి చేసిన ఇంధన సామర్థ్యం, స్టైలిష్ అండ్ స్పోర్టీయర్ లుక్ మరియు అధిక పెర్ఫామెన్స్‌లతో కూడిన కొత్త స్విఫ్ట్ మార్కెట్లో ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించగలదని నేను ఖచ్ఛితంగా చెప్పగలన"ని అన్నారు.
ఆరేళ్ల క్రితం మార్కెట్లోకి ప్రవేశించిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఇప్పటికే ఆరు లక్షలకు పైగా యూనిట్లు అమ్మడై విజయపథంలో దూసుకుపోతుంది. కాగా.. కొత్తగా విడుదల చేసిన స్విఫ్ట్ పెట్రోల్ ఇంజన్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ 1.2 లీటర్ కె-సిరీస్ ఇంజన్‌తో లభిస్తుండగా, డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ 1.3 లీటర్ ఇంజన్‌తో లభిస్తుంది.
సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం వన్ఇండియా ఆటోమొబైల్‍ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








