మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో ముగిసిన సమ్మె

Maruti
గడచిన 13 రోజులుగా మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో జరుగుతున్న సమ్మెకు గురువారం అర్థరాత్రితో తెరపడింది. హర్యానా సర్కారు జోక్యంతో అటు యాజమాన్యం ఇటు కార్మికులు దిగొచ్చారు. యాజమాన్యానికి మరియు వర్కర్లకు మధ్య సయోధ్య కుదర్చడంలో హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హుడా సఫలమయ్యారు. ఇందులో భాగంగా మారుతి సుజుకి విధుల నుంచి తొలగించిన 11 మంది కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడంతో పాటు నోవర్క్‌ నోపే విధానం కింది పెనాల్టీని 8 రోజుల నుంచి 3 రోజులకు తగ్గించేందుకు కూడా కంపెనీ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ తెలిపింది.

అయితే కొత్త యూనియన్ ఏర్పాటుకు మాత్రం యాజమాన్యం ససేమిరా అంటోంది. దీంతో మారుతి యాజమాన్యం డిమాండ్‌కు కార్మికులు తలొగ్గక తప్పలేదు. కార్మికులు యాజమాన్యానికి మధ్య ఒప్పందంపై సంతకాలు అయ్యాయని, నేటి నుంచి కార్మికులు విధులకు హాజరవుతారని హర్యానా కార్మిక శాఖ కార్యదర్శి షర్భన్‌ సింగ్‌ తెలిపారు. కాగా.. 13 రోజుల పాటు జరిగిన ఈ సమ్మె కారణంగా కంపెనీ సుమారు రూ. 570 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ సమయంలో కంపెనీ దాదాపు 11,400 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయినట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Friday, June 17, 2011, 10:43 [IST]
English summary
The 13-day-long strike at Country's largest carmaker Maruti Suzuki India's (MSI) Manesar plant finally came to an end around midnight on Thursday after hectic negotiations between the management, striking workers and Haryana labour department officials.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+