మారుతి సుజుకి ఏ-స్టార్ కారుపై రూ. 43,000 డిస్కౌంట్

Maruti A-Star
భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు ఏ-స్టార్. ప్రత్యేకించి విదేశీ మార్కెట్ల కోసం తయారు చేసిన ఈ కారు భారతీయ రోడ్లపై పెద్దగా విజయం సాధించలేదనే చెప్పొచ్చు. అయితే విదేశీయ మార్కెట్లలో మాత్రం ఇది శరవేగంగా దూసుకుపోతుంది. గమనించినట్లయితే.. మారుతి సుజుకి అత్యధికంగా విక్రయించే మోడళ్లలో మనకు ఏ-స్టార్ కనిపించదు.

ప్రస్తుతం భారత్‌లో మారుతి బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ఆల్టో, వ్యాగన్ఆర్ మరియు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్. గడచిన నెలల్లో ఏ-స్టార్ అమ్మకాలు వరుసగా తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో ఏ-స్టార్ మోడల్‌ విక్రయాలు ఊతమిచ్చేందుకు కంపెనీ ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. మారుతి సుజుకి ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 28,000 నగదు డిస్కౌంట్‌తో పాటుగా రూ. 15,000 ఎక్సేంజ్ డిస్కౌంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది

ఈ ఏడాది మే నెల వరకూ ప్రతి నెలా 4,000 ఏ-స్టార్ కార్లను విక్రయిస్తూ వస్తున్న మారుతి ఆ తర్వాతి కాలంలో సగానికి తగ్గి 1,734 యూనిట్లకు, అక్కడి నుండి గత జులైలో పూర్తిగా వెయ్యి యూనిట్లకు దిగువన 779 కార్లు అమ్ముడయ్యాయి. మరి మారుతి సుజుకి తాజా ఆఫర్‌తో ఏ-స్టార్ సూపర్ స్టార్ అనిపించుకుంటుందో లేదా చూడాల్సిందే. సింగిల్‌గా ఉన్న వారు లేదా కొత్తగా పెళ్లయిన వారికి ఏ-స్టార్ కారు చక్కగా సరిపోతుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 12, 2011, 15:36 [IST]
English summary
Maruti Suzuki, India's leading carmaker has announced a new discount for the A-Star hatchback. The A-Star has not been among Maruti Suzuki's best selling models. Further, sales have declined by more than half since last year. To provide a sales boost to its export oriented model Maruti Suzuki is now offering a cash discount of Rs.28,000 along with a exchange discount of Rs.15,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+