ఉగాది పండుగ సందర్భంగా మారుతి అందిస్తున్న ఆఫర్స్

Maruti Alto
మరికొద్ది రోజుల్లో తెలుగువారి సంవత్సరాది 'ఉగాది' పండుగ వస్తున్న తరుణంలో రాష్ట్రంలోని పలు కంపెనీలు వివిధ ఆకర్షనీయ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త ఆఫర్లను అందిస్తుంది. ఈ సందర్భంగా కంపెనీ రాష్ట్రంలో 'మారుతి సుజుకి ఉగాది ఉత్సవాల"ను ప్రారంభించింది.

సంస్థ అందిస్తున్న వివిధ మోడళ్లపై అదనపు రాయితీలను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 10 నుంచే ప్రారంభించామని, ఇది ఈ నెల 28న ముగుస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా తమ కార్లను కొనుగోళ్లు చేసే వినియోగదారులకు వివిధ మోడళ్లపై రూ. 35,000 నుంచి రూ. 50,000 డిస్కౌంట్ అందిస్తున్న కంపెనీ వివరించింది. ఆల్టో ఎఫ్8, వ్యాగన్-ఆర్ మోడళ్లపై రూ. 35,000, ఎస్టిలో కారుపై రూ. 45,000, ఏ-స్టార్ కారుపై రూ. 50,000, రిట్జ్ కారుపై రూ. 40,000 తగ్గింపును అందిస్తున్నామని తెలిపింది.

ఇవే కాకుండా.. ప్రతి కొనుగోలుపై స్క్రాచ్‌కార్డ్‌ ఆఫర్ ఉంటుందని, ఇందులో ఎల్‌సీడీ టీవీ/ మైక్రోవేవ్/ డీజీక్యామ్/మారుతీ జన్యూన్ యాక్సెసరీల్లో ఏదో ఒకటి తప్పక గెల్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా.. ఈ ఆఫర్లతో పాటు ఓ బంపర్ ప్రైజ్‌ కింద వ్యాగన్-ఆర్‌ కారును గెలుచుకునే అవకాశం కూడా ఉందని కంపెనీ పేర్కొంది. ఈ ప్రత్యేక రాయితీలతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరిన్న అదనపు ప్రయోజనాలుంటాయని, ఈ ఉగాది ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తమ వివిధ కంపెనీ షోరూమ్‌లు, వర్క్‌షాపులలో ఎక్స్ఛేంజ్ మేళాలు, ఇవాల్యూయేషన్ క్యాంపులు కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.

More from DriveSpark

Article Published On: Saturday, March 26, 2011, 12:34 [IST]
English summary
Car companies are offering huge discounts in this March, in view of clear their stocks by this month end as the financial year closing. Companies like country's largest carmaker Maruti Suzuki, Second biggest carmaker Hyundai Motor and Honda Motor are now offering even better discounts and incentives than in December 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+