మారుతి కారు కొంటే బంపర్ ప్రైజ్‌లో రిట్జ్ గెల్చుకునే ఛాన్స్!

Maruti Festive Offers
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కార్ల కొనుగోళ్లపై నగదు తగ్గింపులను, వివిధ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు, ప్రోత్సాహకాలు పరిమిత కాలం మాత్రమే ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

'మారుతి సుజుకి ఫెస్టివ్ ధమాకా' పేరుతో కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా.. మారుతి సుజుకి ఆల్టో ఎఫ్8 కొనుగోలుపై 35,000 రూపాయల తగ్గింపును, వ్యాగన్ఆర్, ఎస్టిలో మరియు ఏ-స్టార్ మోడళ్ల కొనుగోళ్లపై 50,000 రూపాయల తగ్గింపును అలాగే, మారుతి సుజుకి రిట్జ్ కొనుగోలుపై 45,000 రూపాయల తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఫెస్టివ్ ధమాకా ఆఫర్లు అక్టోబర్ 15 వరకూ కొనసాగుతాయని కంపెనీ వివరించింది. అంతేకాకుండా.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఫెస్టివ్ ధమాకా ఆఫర్లతో పాటు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తామని మారుతి సుజుకి తెలిపింది. ఇవి కాకుండా.. ప్రతి మారుతి సుజుకి కారును కొనుగోలు చేసిన వారికి స్క్రాచ్ కార్డ్‌ ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది.

ఈ స్క్రాచ్ కార్డ్‌ ఆఫర్లో సోనీ బ్రేవియా ఎల్‌సీడీ టీవీ లేదా సోనీ కామ్‌కార్డర్ లేదా సోనీ సైబర్ షాట్ కెమెరా లేదా 500 రూపాయాల విలువ కలిగిన గిఫ్ట్ వోచర్లలో ఏదైనా ఒక బహుమతిని తప్పక గెలుపొందే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా.. ఓ బంపర్ ప్రైజ్‌గా మారుతి సుజుకి రిట్జ్ (ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్) కారును కూడా ఆఫర్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. మరింకెదుకు ఆలస్యం వెంటనే మీ మారుతి కారుతో పాటు అదనపు బహుమతులను కూడా సొంతం చేసుకోండి..!

More from DriveSpark

Article Published On: Monday, September 26, 2011, 15:40 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki India (MSI) offering huge discounts and freebies on their cars. Here is the Details. Company wants to improve their in this festive season.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+