ప్రపంచ మార్కెట్ల కోసం గ్లోబల్ కారును అభివృద్ధి చేస్తున్న మారుతి

దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో.. ప్రపంచంలో ఏ దేశ రవాణా నిబంధనలనైనా పాటించేవిధంగా మరియు అన్ని రకాల వాతావరణ సరిపోయే విధంగా మరో ఆరేళ్లలో ఓ గ్లోబల్‌ కారును మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది. రోహ్‌తక్‌లో రూ. 1,500కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త ఆర్ అండ్ డి సెంటర్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని, ఇక్కడ అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ మార్కెట్ల కోసం 2017 కల్లా గ్లోబల్ కార్‌ను తయారు చేయడం లక్ష్యమని కంపెనీ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఆర్ అండ్ డీ) ఐ.వి. రావు చెప్పారు.

గ్లోబల్ కారు తయారీ కోసం తమ మాతృ సంస్థ అయిన సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ నుంచి కొంత సహకారం తీసుకుంటామని జపాన్ మరియు ఐరోపా మార్కెట్లను లక్ష్యంగా ఈ కారును రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ గ్లోబల్ కారు అభివృద్ధి భారతీయ ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తారని, ఇప్పటికే తమ ఇంజనీర్లు స్విఫ్ట్‌, రిట్జ్‌ వంటి కార్ల రీసెర్చ్‌లో గడించిన అనుభవం ఈ గ్లోబల్‌ కారును మరింత మెరుగ్గా తయారు చేసేందుకు సహకరిస్తుందని రావు అన్నారు. ప్రస్తుతం తమ జట్టు ఆల్టో ఫ్లాట్‌ఫామ్‌పై ఓ చిన్న కారును అభివృద్ధి చేస్తోందని, ఇది 800 సీసీ ఇంజన్‌ను కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. వచ్చే ఈ చిన్న కారు మార్కెట్లోకి రావచ్చునని భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, August 22, 2011, 10:21 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki India (MSI) is aiming higher with plans to roll out a global car by 2017 as it strengthens their R&D activities in Rohtak. "Our ultimate aim is to develop a car for the global market. With our new R&D centre at Rohtak getting ready, we will start working on a global car," Maruti Suzuki India (MSI) Managing Executive Officer (R&D) I V Rao said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+