మారుతి సుజుకి క్యూ4 ఫలితాల్లో మార్జినల్ వృద్ధి

నాలుగో త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయం గతేడాదితో పోలిస్తే.. 18.93 శాతం వృద్ధి చెంది రూ. 8,485.83 కోట్ల నుంచి రూ. 10,092.18 కోట్లకు పెరిగింది.అలాగే ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆటోమొబైల్ విక్రయాలు 2,87,422 యూనిట్ల నుంచి 3,43,340 యూనిట్లకు పెరిగి 19.46 శాతం వృద్ధిని కనబరచాయి.
2010-11 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ ఏకీకృత నికరలాభం 9.23 శాతం క్షీణించి 2,624.64 కోట్ల నుంచి 2,382.37 కోట్లకు పడిపోయింది. 2010-11లో నిర్వహణ ద్వారా వచ్చిన ఏకీకృత మొత్త ఆదాయం, గత ఆర్థిక సంవత్సరం (2009-10)తో పోలిస్తే 24.75 శాతం వృద్ధి చెంది రూ. 30,122.51 కోట్ల నుండి రూ. 37,578.48 కోచ్లకు పెరిగింది. ఈ సమయంలో కంపెనీ విక్రయాలు 24.81 శాతం వృద్ధి చెంది 10,18,365 యూనిట్ల నుంచి 12,71,005 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








