కంపెనీ అంచనాలకు మించి కిజాషి బుకింగ్స్: మారుతి సుజుకి

Maruti Suzuki Kizashi
దేశీయ అతిపెద్ద ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) తొలిసారిగా మార్కెట్లో ప్రవేశపెట్టిన లగ్జరీ కారు "కిజాషి" అనుహ్య స్పందన నభిస్తోంది. ప్యాసింజర్ కార్ల విభాగంలో మారుతి మార్కును వినియోగదారులు ఎన్నిటికీ మరిచిపోలేరు. అలాంటిది మారుతి మొట్టమొదటి సారి ఓ ప్రిమీయం కారును విడుదల చేయడంతో.. కిజాషిను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు క్యూ కట్టారు. కిజాషి విడుదలయిన 25 రోజుల్లోనే 350 యూనిట్ల ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ అంచనాలకు మించి ఆర్డర్లు అందుతున్నట్లు మారుతి సుజుకి సేల్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

2.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ సామర్థ్యంతో లభించే ఈ కారు రెండు వేరియంట్లలో లబిస్తుంది. ఒకటి మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (గేరు మార్పిడి వ్యవస్థ), మరొకటి ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడల్ ధర రూ. 16.5 లక్షలు ఉండగా.. ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడల్ ధర రూ. 17.5 లక్షలుగా ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), క్రూయీజ్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 10-వే సీట్ అడ్జస్ట్‌మెంట్ వంటి అత్యాధునిక సేఫ్టీ సదుపాయాలు కిజాషిలో ఉన్నాయి. మ్యాన్యువల్ గేర్ వ్యవస్థ కలిగిన కిజాషి కేవలం 7.8 సెకండ్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అదే ఆటోమేటిక్ గేర్ వ్యవస్థ కలిగిన కిజాషి 8.8 సెకండ్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది.

అలాగే మ్యాన్యువల్ వెర్షన్ కిజాషి గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ... లీటరుకు 12.53 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ కిజాషి గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ... లీటరుకు 12.45 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హోండా అకార్డ్, నిస్సాన్ టీనా, వోక్స్‌వ్యాగన్ పస్సాట్, స్కొడా సూపర్బ్, టొయోటా క్యామ్రే వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి మారుతి సుజుకి కిజాషిను ప్రవేశపెట్టింది. ఇంత ప్రజాదరణ పొందుతున్న కిజాషి సాంకేతిక వివరాలపై ఓ లుక్కేయండి మరి..!

మారుతి కిజాషి సాంకేతిక వివరాలు
ఇంజన్ టైప - 2393 సీసీ, డిఓహెచ్‌సి, 16-వాల్వ్, పెట్రోల్
గరిష్ట పవర్ - 176 bhp @ 6,000 rpm
గరిష్ట టార్క్ - 23 Kgm @ 4,000 rpm
ట్రాన్సిమిషన్ (గేర్లు) - 6 మ్యాన్యువల్/ఆటోమేటిక్
పొడవు - 4650 mm
వెడల్పు - 1821 mm
ఎత్తు - 1480 mm
వీల్‌బేస్ - 2700 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 145 mm
బరువు - 1,510 kg
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 63 లీటర్లు
బూట్ కెపాసిటీ - 460 లీటర్లు
ఫ్రంట్ లెగ్‌రూమ్ - 1059 mm
రియర్ లెగ్‌రూమ్ - 904 mm
టైర్లు - 215/55 R 17 (అల్లాయిస్)
ముందు సస్పెన్షన్ - మెక్‌ఫెర్సన్ స్ట్రట్
వెనుక సస్పెన్షన్ - మల్టీ-లింక్ ఇండిపెండెంట్
ముందు బ్రేక్స్ - వెంటెడ్ డిస్క్
వెనుక బ్రేక్స్ - సాలిడ్ డిస్క్

More from DriveSpark

Article Published On: Tuesday, March 1, 2011, 14:57 [IST]
English summary
The recent launch of Maruti’s Kizashi has some good cheers to share for the car lovers and the maker. The company has received 350 units of Kizashi in just 25 days of launch of this sports luxury sedan. The company’s sales executive officer said the bookings have made a deep impact by overtaking the company’s expectations. He however, could not assure at the time of the official launch last month. He just mentioned that the car could account just 2.8% in the net Indian passenger car segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+