హంగేరీకు ఇంజన్‌ల ఎగుమతి కట్: మారుతి సుజుకి

Maruti Swift
గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత్‌లో డీజిల్ కార్లకు డిమాండు ఒక్కసారిగా ఊపందుకోవడంతో హంగేరీ దేశానికి డీజిల్ ఇంజన్‌ల ఎగుమతిని నిలిపివేయాలని దేశపు అగ్రగామి కార్ల తయారీ మారుతి సుజుకి నిర్ణయించింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తమ పోటీదారుల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మేనేజింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ ‌(మార్కెటింగ్‌, సేల్స్‌) మేయాంక్‌ పారీక్‌ తెలిపారు.

భారత చిన్న కార్ మార్కెట్లోకి ఇటీవల కాలంలో ప్రవేశించిన ఫోర్డ్ ఫిగో, నిస్సాన్ మైక్రా, ఫోక్స్‌వ్యాగన్ పోలో, టొయోటా లివా వంటి విదేళీ మోడళ్ల కారణంగా చిన్న కార్ మార్కెట్లో పోటీ గణనీయంగా పెరింగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ పోటీని తట్టుకుని మారుతి సుజుకి తన యధాస్థానాన్ని నిలుపుకునేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఇందులో భాగంగానే పాత్ స్విఫ్ట్ ఉత్పత్తిని నిలిపినేసి ఇందులో కొత్త వెర్షన్‌ను ఈ నెలలో విడుదల చేయనుంది. దేశీయ మార్కెట్లో డిమాండ్‌ పెరగడంతో హంగేరీకి ఎగుమతులను నిలిపివేస్తున్నామని, ప్రస్తుతం హంగేరీకు ఏటా 35,000 నుంచి 45,000 డీజిల్‌ ఇంజన్లను ఎగగుమతి చేస్తున్నామని పారీక్‌ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Friday, August 5, 2011, 10:26 [IST]
English summary
Maruti Suzuki India has decided to reduce its diesel engine exports to Hungary and focus on the domestic market. The Indian carmaker has decided to drastically reduce its exports of diesel engines to counter the competition that has emerged against the Swift premium hatchback.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+