సేల్స్ టార్గెట్‌ను తగ్గించుకున్న మారుతి సుజుకి

Maruti Sales
దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ తమ సేల్స్ టార్గెట్‌ను తగ్గింకుంచుకుంటున్నట్లు పేర్కొంది. గతంలో కంపెనీ సేల్స్ టార్గెట్‌ను 13 శాతంగా నిర్ణయిస్తే, ప్రస్తుతం దాన్ని 8 శాతానికి తగ్గించుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. మారుతి సుజుకి మాతృ సంస్థ అయిన, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒసాము సుజుకి మాట్లాడుతూ.. అధిక ఉత్పాదక వ్యయం, ద్రవ్యోల్బణం మరియు ఇతర సమస్యల కారణంగా 2011-12లో సేల్స్ టార్గెట్‌ను 1.18 మిలియన్లుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

2010-11లో మారుతి సుజుకి 1.13 మిలియన్ వాహనాలను విక్రయించి 30 శాతం వృద్ధిని నమోదు చేసుకుని దాదాపు 45 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) అంచనాల ప్రకారం, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ 14-16 శాతం వృద్ధి చెందితే మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) మార్కెట్ వాటా 42 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. గడచిన రెండు నెలలుగా గమనిస్తే.. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధిక ఇంధన ధరలు ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రభావాలను చూపుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, June 25, 2011, 11:50 [IST]
English summary
Maruti Suzuki India Ltd (MSIL), the country’s largest passenger car maker has said that its sales growth target for the current year lowered from the earlier projection of 13 per cent to eight per cent.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+