సరికొత్త 800 సీసీ కారును విడుదల చేయనున్న మారుతి

జపనీస్ మాతృసంస్థ సుజుకి సహాయంతో ఈ కొత్త కారును అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న కాలుష్య నిబంధనల దృష్ట్యా దాదాపు 13 ప్రధాన మెట్రో నగరాల్లో ఈ చిన్న కారు అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. టాటా మోటార్స్ అందిస్తున్న చిన్న కారు టాటా నానో నుంచి ఎదురవతున్న పోటీ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మారుతి 800 అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి ఎమ్ 800 కారు పునఃజ్జీవం కల్పించాలని కంపెనీ దృఢ సంకల్పంతో ఉంది.
అంటే.. త్వరలోనే కొత్త మారుతి 800 కారును మెట్రో నగరాల్లో మనం చూడనున్నాం అన్నమాట. అయితే, ఈ కారు సంబంధించిన ధర తదితర వివరాలను మాత్రం రావు వెల్లడించలేదు. కానీ.. ఇది రూ. 2 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. ఇది ఆల్టో హ్యాచ్‌బ్యాక్ ధర కన్నా రూ. 40,000 తక్కువ, టాటా నానో స్టాండర్డ్ వేరియంట్ ధర కన్నా రూ. 50,000 ఎక్కువ. ఇక విభాగంలో మరో అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ కూడా ఓ 800 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన చిన్నకారును అభివృద్ధి చేస్తోంది.


Click it and Unblock the Notifications








