మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌‌కు పెరుగుతున్న ఆదరణ

Maruti Suzuki
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ కారు 'రిట్జ్' ఆదరణ భారీగా పెరుగుతుంది. గడచిన ఆర్థిక సంవత్సరం(2010-11)లో 69,000 రిట్జ్ కార్లను విక్రయించినట్లు ఎమ్ఎస్ఐ మార్కెటింగ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ వెల్లడించారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 63,000 యూనిట్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మారుతి సుజుకి రిట్జ్ పెట్రోల్ వేరియంట్ కారు లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని, అలాగే.. డీజిల్ వేరియంట్ కారుతో లీటరుకు 20 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చని ఆయన వివరించారు.

కాగా.. మారుతి సుజుకి మానేసర్ ప్లాంటుల వర్కర్లు కొత్తగా ఏర్పాటు చేసిన యూనియన్‌ను యాజమాన్యం గుర్తించాలంటూ శ్రామికులు చేపట్టిన సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. ఈ సమ్మె కారణంగా కంపెనీ ఉత్పత్తి తీవ్రంగా నష్టపోతుంది. ఈ సమ్మె మరికొంత కాలం ఇలాగే కొనసాగితే, సంస్థ అమ్మకాలపై ప్రభావం పడుతుందని మారుతీ సుజుకి చైర్మన్ ఆర్‌సీ భార్గవ తెలిపారు. అంతేకాకుండా డీజిల్ కార్ల వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుందని, ఎగుమతులపై కూడా ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా మారుతి సుజుకికు దాదాపు రూ.150 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, June 8, 2011, 10:28 [IST]
English summary
Country's largest carmaker Maruti Suzuki India (MSI) flagship hatchback variant model Ritz is receiving tremendous response from the customers. Company said it has sold 69,000 units in FY11.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+