మారుతి సుజుకి 100,00,000వ కారు వ్యాగన్ఆర్ విఎక్స్ఐ

Maruti Suzuki
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌కు ఆటోమొబైల్ చరిత్రలో నేడు ఓ అరుదైన మైలురాయిగా మిగిలిపోనుంది. భారతదేశంలో కోటి కార్లను ఉత్పత్తి చేసిన ఏకైక సంస్థగా మారుతి రికార్డు సృష్టించింది. మార్చి 15, 2011న కంపెనీ ఈ అరుదైన ఘనతను సాధించింది. గుర్గావ్‌లో ఉన్న మారుతి సుజికి ప్లాంటులో చారిత్రాత్మకమైన కోటవ కారుగా "మెటాలిక్ బ్రీజ్ బ్లూ కలర్ వ్యాగన్ఆర్ విఎక్స్ఐ" (ఛాస్సిస్ నంబర్ 243899) నిలిచింది.

ఈ అరుదైన రికార్డును సాధించేందుకు మారుతి సుజుకికు దాదాపు 27 ఏళ్ల సమయం పట్టింది. 1983 సంవత్సరంలో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ (అప్పటి పేరు), భారత ప్రభుత్వం, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్‌లతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి తొలి మోడల్ కారు "మారుతి ఎమ్800" ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ జేవీలో ప్రస్తుతం సుజుకి మోటార్ కార్పోరేషన్‌కు 54.2 శాతం వాటా ఉంది. మొదటి 50 లక్షల కార్లు ఉత్పత్తి చేయడానికి 22 సంవత్సరాలు పట్టిందనీ, తర్వాతి 50 లక్షల కార్లను 6 సంవత్సరాల లోపే ఉత్పత్తి చేయగలిగామని కంపెనీ వివరించింది. మరి మారుతి ఉత్పత్తి చేసిన ఈ లక్కీ కారును సొంతం చేసుకునేదెవరో వేచి చూడాల్సిందే మరి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 15, 2011, 17:49 [IST]
English summary
Maruti Suzuki India Limited, the country’s largest car manufacturer today rolled out its 1 Crore (ten millionth) car. The historic 1 Crore car, a Metallic Breeze Blue coloured WagonR VXi (Chassis No 243899) rolled out from the Company’s Gurgaon plant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+