సమ్మె చేస్తున్న 11 మంది కార్మికులపై వేటు వేసిన మారుతి

యాజమాన్యానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వర్కర్లు సమ్మెకు దిగారని, వారితో యాజమాన్యం చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు. వర్కర్ల డిమాండును అంగీరించేందుకు ఆయన వ్యతిరేకిస్తూ.. మరో యూనియన్ ఉండబోదని, వాళ్లకు అలాంటి సమస్యలు ఏవైనా ఉంటే ముందుగా తమకు ఓ లేఖ ద్వారా తెలిపి, తమతో చర్చించలు జరపాల్సిందని భార్గవ అన్నారు. అయితే ఈ సమస్యకు త్వరలోనే కంపెనీ ఓ పరిష్కారాన్ని కనుగొనగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మానేసర్ ప్లాంటులో వర్కర్ల సమ్మె కారణంగా ఉత్పత్తి శనివారం సెకండ్ షిఫ్ట నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల కంపెనీ దాదాపు 1,200 యూనిట్లకు పైగా ఉత్పత్తిని నష్టపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








