పది నెలల్లో పది లక్షల కార్లను విక్రయించిన మారుతి సుజుకీ

మారుతి సుజుకి ఇండియా అనుబంధ సంస్థ అయిన సుజుకి మోటార్ కార్పోరేషన్ మొత్తం ప్రపంచ విక్రయాలలో దాదాపు 50 శాతానికి పైగా విక్రయాలు ఎమ్ఎస్ఐ ఉన్నాయి. 2009-10 ఆర్థిక సంవత్సరంలో మారుతి మొత్తం విక్రయాలు 10,18,365 యూనిట్లుగా ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది ప్రతి నెలా లక్షకు పైగా కార్లను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కార్లను సరఫరా చేసేందుకు మనేసర్‌లో రూ. 1925 కోట్ల వ్యయంతో వార్షికంగా 2.5 లక్షల కార్లను ఉత్పత్తి చేయగల ప్లాంటును నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మనేసర్ ప్లాంటును జనవరి, 2012 నాటికి అందుబాటులోకి తేవాలని, అలాగే మరో ప్లాంటు (మూడో యూనిట్)ను డిసెంబర్ 2012 లేదా 2013 ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








