పది నెలల్లో పది లక్షల కార్లను విక్రయించిన మారుతి సుజుకీ

Maruti Suzuki
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న మారుతి సుజుకి మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే 10 లక్షల కార్లను విక్రయించిన ఘనత తొలిసారిగా మారుతికే దక్కింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాల వ్యవధిలో పది లక్షల కార్లను మారుతి విక్రయించింది. ఏప్రిల్‌ - డిసెంబర్‌ 2010 మధ్య కాలంలో మొత్తం దేశీయ, విదేశీయ విక్రయాలు 9,27,655 యూనిట్లుగా ఉన్నాయని, జనవరి 2011 నెలలో 25వ తేదీ నాటికి 73,874 యూనిట్ల అమ్మకాలు నమోదైనాయని మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) ఉన్నాతధికారి ఒకరు వివరించారు. దీంతో మొత్తం 10,01,529 యూనిట్ల అమ్మకాలు జరిగాయని, జనవరి విక్రయాల్లో ఎగుమతులను కలపలేదని ఆయన పేర్కొన్నారు.

మారుతి సుజుకి ఇండియా అనుబంధ సంస్థ అయిన సుజుకి మోటార్ కార్పోరేషన్ మొత్తం ప్రపంచ విక్రయాలలో దాదాపు 50 శాతానికి పైగా విక్రయాలు ఎమ్ఎస్ఐ ఉన్నాయి. 2009-10 ఆర్థిక సంవత్సరంలో మారుతి మొత్తం విక్రయాలు 10,18,365 యూనిట్లుగా ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది ప్రతి నెలా లక్షకు పైగా కార్లను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కార్లను సరఫరా చేసేందుకు మనేసర్‌లో రూ. 1925 కోట్ల వ్యయంతో వార్షికంగా 2.5 లక్షల కార్లను ఉత్పత్తి చేయగల ప్లాంటును నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మనేసర్ ప్లాంటును జనవరి, 2012 నాటికి అందుబాటులోకి తేవాలని, అలాగే మరో ప్లాంటు (మూడో యూనిట్)ను డిసెంబర్‌ 2012 లేదా 2013 ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.

Most Read Articles

Story first published: Thursday, January 27, 2011, 13:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X