సమ్మె ప్రభావం: జూన్‌లో 9 శాతం పడిపోయిన మారుతి విక్రయాలు

Maruti Suzuki Kizashi
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) గడచిన జూన్ నెల విక్రయాలు 8.8 శాతానికి పడిపోయాయి. పెరిగిన ఇంధన ధరలు, అధిక వడ్డీ రేట్లకు తోడు కంపెనీలో 13 రోజుల పాటు సాగిన సమ్మె మరియు ప్లాంటు మూసివేతల కారణంగా డీజిల్ కార్ల వెయింట్ పీరియడ్ పెరిగి కంపెనీ విక్రయాలపై ప్రభావాన్ని చూపాయి. జూన్ 2011 నెలలో కంపెనీ 80,298 యూనిట్లు మాత్రమే నమోదయ్యాయి. అదే జూన్ 2010లో కంపెనీ విక్రయాలను గమనిస్తే.. అవి 88,091 యూనిట్లుగా ఉన్నాయి.

అలాగే, దేశీయ మార్కెట్లో అమ్మకాలు కూడా 3.8 శాతం పడిపోయి 72,812 యూనిట్ల నుంచి 70,020 యూనిట్లకు తగ్గాయి. ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు కూడా భారీగా పడిపోయాయి. గత నెలలో కంపెనీ ఎగుమకులు 32.7 శాతం క్షీణించి 15,279 యూనిట్ల నుంచి 10,278 యూనిట్లకు తగ్గాయి. మారుతి సుజుకి ఒకప్పటి లక్కీ బ్రాండ్ అయిన ఎమ్800 విక్రయాలు కూడా 12.8 శాతం క్షీణించి 2,090 యూనిట్ల నుంచి 1,823 యూనిట్లకు పడిపోయాయి. మారుతి సుజుకి అందిస్తున్న తొలి లగ్జరీ కారు కిజాషి జూన్‌లో 32 కార్లు అమ్ముడయ్యాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 1, 2011, 12:24 [IST]
English summary
In a clear indication of India's largest car maker Maruti Suzuki struggling top come to terms with changing market situations, its June sales fell a whopping 8.8 per cent. Maruti Suzuki sales were slowing down considerable but had monthly sales were never been lower than corresponding periods in the previous year. Sales in June 2011 stood at 80,298 units as against the 88,091 vehicles it sold in June 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+