మే 2011 నెలలో మందగించిన మారుతి సుజుకి విక్రయాలు

Maruti Suzuki
మార్కెట్ విశ్లేషకులు/కంపెనీలు ఊహించినట్లుగానే మే 2011 నెలలో వివిధ మార్కెట్ పరిస్థితుల కారణంగా (ముఖ్యంగా పెట్రోల్, వడ్డీ రేట్ల పెంపు) ఆటోమొబైల్ విక్రయాలు మందగించాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) మే 2011 నెల విక్రయాలలో కేవలం 1.9 శాతం మాత్రమే వృద్ధిని సాధిచింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే మొత్తం విక్రయాలు 1,02,175 యూనిట్ల నుంచి 1,04,073 యూనిట్లకు పెరిగినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

గతేడాదితో ఇదే కాలంతో పోలిస్తే దేశీయ మామార్కెట్లో మొత్తం విక్రయాలు 3.9 శాతం వృద్ధి చెంది 90,041 యూనిట్ల నుంచి 93,519 యూనిట్లకు పెరిగాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే.. గేడాది మే నెలతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం మే నెల విక్రయాలు 13 శాతానికి పడిపోయాయి. మే 2010లో మొత్తం 12,134 యూనిట్లను ఎగుమతి చేస్తే, మే 2011లో కేవలం 10,554 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి.

ఒకప్పటి మారుతి ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎమ్800 విక్రయాలు 11.6 శాతనికి పడిపోయాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఎమ్800 కార్ల విక్రయాలు 2,558 యూనిట్ల నుంచి 2,262 యూనిట్లకు పడిపోయాయి. ఏ2 సెగ్మెంట్‌లో (ఆల్టో, వ్యాగన్ఆర్, ఎస్టిలో, స్విఫ్ట్, ఏ-స్టార్, రిట్జ్) కూడా విక్రయాలు 2.6 శాతానికి పడిపోయాయి. ఈ సెగ్మెంట్లో మే 2010లో 62,679 యూనిట్లను విక్రయిస్తే, మే 2011లో 61,048 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

అయితే ఏ3 సెగ్మెంట్‌లో (ఎస్ఎక్స్4, డిజైర్)లో మాత్రం విక్రయాలు 24.2 శాతం వృద్ధి చెంది 10,883 యూనిట్ల నుంచి 13,514 యూనిట్లకు పెరిగాయి. ఈ ఫిబ్రవరిలో విడుదలైన మారుతి సుజుకి తొలి లగ్జరీ సెడాన్ 'కిజాషి' గత నెలలో 50 కార్లు అమ్ముడయ్యాయి. ఇకపోతే ఎమ్ఎస్ఐ మొత్తం ప్యాసింజర్ విక్రయాలు గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 1 శాతం మాత్రమే వృద్ధి చెంది 76,120 యూనిట్ల నుంచి 76,874 యూనిట్లకు పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 1, 2011, 12:46 [IST]
English summary
The country's largest car-maker Maruti Suzuki India (MSI) reported a 1.9% raise in total sales for the month of May'2011. Company total sales increase to 1,04,073 units from 1,02,175 units in the same month last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+