ఏప్రిల్ నెల విక్రయాలలో జోరు తగ్గిన మారుతి సుజుకి

Maruti
మారుతి సుజుకి వేగానికి బ్రేక్ పడింది. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఏప్రిల్ నెల విక్రయాలలో కేవలం 4.4 శాతం వృద్ధిని మాత్రమే సాధించగలిగింది. ఏప్రిల్ 2011లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) విక్రయాలు 97,155 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 93,058 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కంపెనీ విక్రయాలు 8.88 శాతం వృద్ధితో 80,034 యూనిట్ల నుంచి 87,144 యూనిట్లకు పెరిగాయి.

అయితే ఈ నెలలో మారుతి ఎగుమతులు మాత్రం, 23.13 శాతం క్షీణించాయి. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్ 2011లో మారుతి సుజుకి ఎగుమతులు 13,024 యూనిట్ల నుంచి 10,011 యూనిట్లకు పడిపోయాయి. అనూహ్యంగా మారుతి ఎమ్800 మోడల్ కారు విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ నెలలో ఎమ్800 విక్రయాలు 11.96 శాతం వృద్ధిని సాధించి, 2,258 యూనిట్ల నుంచి 2,528 యూనిట్లకు పెరిగాయి.

అలాగే ఏ2 కార్ సెగ్మెంట్‌ (ఆల్టో, వ్యాగన్ఆర్, ఎస్టిలో, స్విఫ్ట్, ఏ-స్టార్, రిట్జ్) విక్రయాలలో 1.82 శాతం వృద్ధిని కనబరిచి 56,416 యూనిట్ల నుంచి 57,443 యూనిట్లకు పెరిగాయి. ఏ3 కార్ సెగ్మెంట్‌ (ఎస్ఎక్స్4, డిజైర్)లో 39.07 శాతం వృద్ధిని సాధించి 9,994 యూనిట్ల నుంచి 13,899 యూనిట్లకు పెరిగినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలు 7.63 శాతం వృద్ధిని సాధించి గతేడాది పోలిస్తే 68,668 యూనిట్ల నుంచి 73,905 యూనిట్లకు పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Monday, May 2, 2011, 12:29 [IST]
English summary
The country's largest car-maker Maruti Suzuki India today reported a 4.40% jump in April sales to 97,155 units. Sales for the same month last year stood at 93,058 units, Maruti Suzuki India (MSI) said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+