మారుతి సుజుకి "సుప్ర ఎస్ఏఈఇండియా-2011" ప్రారంభం

ఎస్‌ఏఈ, మారుతి సుజుకిలకు చెందిన ప్రముఖలు తమిళనాడులోని శ్రీపెరంబూర్ రేస్ ట్రాక్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో 1,100 మంది ఔత్సాహిక ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొంటున్నారు. మొత్తం 44 జట్లు తలపడనున్న ఈ పోటీలో విద్యార్థులు తమ ప్రతిభను ఉపయోగించి ఫార్ములా-1 రేసింగ్ ప్రోటోటైప్ కార్లను మూడు రోజుల్లోగా డిజైన్ చేసి ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇందులో గెలుపొందిన విజేతల వివరాలను జులై 3న వెల్లడిస్తారు.
గత మార్చి నెలలో మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ ఇండియా (ఎస్ఏఈఇండియా)తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా "సుప్ర ఎస్ఏఈఇండియా 2011" పోటీకు మారుతి సుజికి తన మద్దతును అందిచాల్సి ఉంటుంది. ఇది యువ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను ప్రమోట్ చేస్తుంది. ఫార్ములా-1 స్టైల్ కార్లను డిజైన్ చేసేందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను మారుతి కల్పించనుంది.
ఆటోమొబైల్స్ ప్యాషన్‌ను అర్థం చేసుకోవడంతో విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇదొక గొప్ప అవకాశం. ఈ కాంపిటీషన్‌లో గెలిచిన అత్యుత్తమ డిజైన్ కారును ఆక్టోబర్ 2011న చెన్నయ్‌లో జరగబోయే ఆసియా పసిఫిక్ ఆటోమోటివ్ కాన్ఫరెన్స్‌లోను అలాగే వచ్చే ఏడాది న్యూఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2012లో ప్రదర్శించడం జరుగుతుంది. మరిన్ని వివరాలను సుప్రఎస్ఏఈఇండియా ఆర్గ్ అనే వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








