ఫిబ్రవరిలో మారుతి సుజుకి ఎస్ఎక్స్4 డీజిల్ వేరియంట్..!?

మారుతి సుజుకి ఎస్ఎక్స్4 విక్రయాలు 2010 ద్వితీయార్థం (జులై-డిసెంబర్ 2010)లో ప్రతినెల వెయ్యి యూనిట్లకు తగ్గకుండా అమ్ముడయ్యాయి. ఒక్క డిసెంబర్ నెలలో మాత్రం ధరల పెరుగుదల కారణంగా.. అతికష్టం మీద ఈ విక్రయాలు 761 యూనిట్లుగా నమోదయ్యాయాయి. అయితే ఇదే సమయంలో ఎస్ఎక్స్4కు పోటీగా నిలిచిన (డీజిల్ వేరియంట్ కార్లు) వోల్క్స్‌వ్యాగన్ వెంటో, ఫోర్డ్ ఫియస్టాలు కూడా ప్రతినెలా వెయ్యికి పైగా కార్లను విక్రయించాయి. మారుతి సుజుకి ఎస్ఎక్స్4లో ఇప్పటి వరకూ పెట్రోల్ వేరియంట్ మాత్రమే లభిస్తుంది.
ఈ నేపథ్యంలో మార్కెట్ పోటీని తట్టుకొని, ఈ మోడల్ విక్రయాలను మరింత పెంచుకోవడానికి త్వరలోనే ఎస్ఎక్స్4లో డీజిల్ వేరియంట్ విడుదల చేయాలని మారుతి భావిస్తుంది. కాగా..కొత్త మారుతి సుజుకి ఎస్ఎక్స్4 డీజిల్ వేరియంట్‌లో 90 బిహెచ్‌పి సామర్థ్యం కలిగిన 1.3 లీటర్ డిడిఐఎస్ ఇంజన్ ఉండవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత నెల చైనాలో ఈ మోడల్‌ను మారుతి ప్రదర్శనకు ఉంచింది. మరి ఇది భారత్‌కు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. సాధారణంగా పెట్రోల్ వేరియంట్ కార్ల కన్నా డీజిల్ వేరియంట్ కార్లు దాదాపు లక్ష రూపాయలు అధికంగా ఉంటాయి. దీన్నిబట్టి చూస్తే..ఎస్ఎక్స్4 డీజిల్ వేరియండ్ సుమారు రూ. 8.5 లక్షలు ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








