హర్యానాలో మూడో ప్లాంటు ఏర్పాటుకు మారుతి సన్నాహాలు..!

Maruti Suzuki Plant
ఆటోమొబైల్ రంగంలో పోటీని తట్టుకోవాలి డిమాండుకు తగిన ఉత్పత్తి ఉండాలి. ఇప్పటికే పలు కంపెనీలు వినియోగదారుల అవసరాలను తీర్చడంలో విమర్శలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను గమనించిన దేశీయ అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ "మారుతి సుజుకి" మార్కెట్లో తన అగ్ర స్థానాన్ని నిలుపుకునేందుకు భారీ కసరత్తులు చేస్తుంది. లగ్జరీ కార్ల మార్కెట్లో మారుతి బ్రాండ్ లేదనే లోటను భర్తీ చేసేందుకు కంపెనీ ఇటీవల కిజాషి అనే లగ్జరీ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా కార్లను సరఫరా చేసే దిశగా హర్యానాలో మూడో ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

వార్షికంగా ఆరు లక్షల కార్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో హర్యానాలోని రోహ్‌తక్‌లో దాదాపు 600 ఎకరాల స్థలంలో మారుతి తన మూడవ మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. భవిష్యత్‌లో ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 20 లక్షలకు పెంచుకునే విధంగా మౌలిక వసతులు కల్పిస్తామని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్లాంటు ఎరెక్షన్ కోసం మారుతి 1000 కోట్ల రూపాయల వెచ్చించనుంది. ప్రస్తుతం గుర్గావ్, మానేసర్ ప్లాంట్ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 12 లక్షల యూనిట్లుగా ఉంది. అలాగే మనేసర్‌లో ఉన్న ప్లాంటు విస్తరణ పనులు 2013లోగా పూర్తికానుంది. ఇందుకోసం కంపెనీ రూ. 2,000 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించనుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 11, 2011, 11:11 [IST]
English summary
The circumstances in the camps of Maruti force it to think of erecting the third plant sooner. There has been a rise in the utilization level and a great demand for its vehicles resulting with the Rohtak facility as the third plant with 6 lakh units annually.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+