సరికొత్త హంగులతో మార్కెట్లోకి రానున్న మారుతి 800!

మరోవైపు భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ త్వరలోనే 800 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఓ చిన్నకారును విడుదల చేయనున్నట్లు ప్రకటించడం మారుతి సుజుకి సంస్థలో మరింత పట్టుదలను రేకెత్తించినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పరిశీలించిన కంపెనీ అప్‌గ్రేడెడ్ ఇంజన్, ఆకర్షనీయమైన డిజైన్‌తో టాటా నానోకు పోటీ ఇచ్చే విధంగా మారుతి 800 కారను తీర్చిదిద్దుతున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.
ఓ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఉన్న మారుతి 800 మోడల్‌ను ఈ కొత్త మోడల్ రీప్లేస్ చేయనుంది. అయితే, పేరు మాత్రం మారబోదు. ఇక దీని ధర కూడా రూ. 2 లక్షల వరకూ ఉండే అవకాశం ఉంది. అంటే, ఇది ఆల్టో హ్యాచ్‌బ్యాక్ ధర కన్నా రూ. 40,000 తక్కువ, టాటా నానో కన్నా రూ. 50,000 ఎక్కువ. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి కొన్ని స్పై షాట్ (రహస్య చిత్రాలు)లు కూడా ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








