జనవరిలో 'ఎర్టిగా' ఎమ్‌పివిని ఆవిష్కరించనున్న మారుతి

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా తాము కూడా సరికొత్త పధకాలతో ముందుకు సాగుతున్నామని, భవిష్యత్తులో ఎస్‌యూవీ, ఎమ్‌పివి, ఎమ్‌యూవీ సెగ్మెంట్లలో మరిన్ని ఉత్పత్తులను అందించేంకు కంపెనీ సిద్ధంగా ఉందని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పరీక్ వెల్లడించారు.
ఇప్పటికే మార్కెట్ లీటర్‌గా భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి, భవిష్యత్తులో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా, దేశీయ వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్లో జపాన్‌లో తయారైన్ "గ్రాండ్ విటారా"ను సిబియూగా దిగుమతి చేసుకుని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తుంది.
రానున్న నాలుగేళ్లలో భారతదేశం కూడా అంతర్జాతీయ ఆటోమొబైల్ హబ్‌గా ఎదగగలదని, ఆ సమయం నాటికి ప్యాసింజర్ వాహన విభాగంలో 50 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలనే లక్ష్యం దిశగా మారుతి సుజుకి అడుగులు వేస్తుందని ఆయన చెప్పారు. భారత్‌లో టొయోటా కిర్లోస్కర్ అందిస్తున్న ఎమ్‌పివి ఇన్నోవాకు పోటీగా మారుతి ఎర్టిగా ప్రవేశించనుంది.


Click it and Unblock the Notifications








