ఒక్క ఐడియాకు రూ. 10 లక్షలు ప్లస్ వ్యాగన్ ఆర్ కారు

Think Big Challenge 2
ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అదేంటి కొంపదీసి ఐడియా సెల్యూలార్ అడ్వర్టైజ్‌మెంట్ గురించి ఏమైనా చెబుతున్నారనుకుంటున్నారా...? అదేంకాదండీ.. బాబు వాస్తవానికి ఇది ఐడియా సెల్యూలార్ ట్యాగ్‌లైనే అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఇది నూటికి నూరుపాళ్లు నిజమనే చెప్పాలి. విషయమేంటంటే.. ఈ ఏడాది జనవరి నెలలో దేశీయ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి "వ్యాగన్ ఆర్ థింక్ బిగ్ ఛాలెంజ్ 2" అనే పేరుతో ఓ క్విజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పోటీదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటంటే... ఇందులో పాల్గొన్న సభ్యులు కొత్త కొత్త బిజినెస్ ఐడియాలను చెప్పి నిర్వాహకులను మెప్పించాలి. అలా వివిధ స్టేజ్‌ల అనంతరం ఫైనల్లో గెలిచిన విజేతకు రూ. 10 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు ఓ వ్యాగన్ ఆర్ కారును బహుకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభించిన మూడు వారాల్లోనే 20,000 ఎస్‌ఎమ్‌ఎస్ రిజిస్ట్రేషన్లు అందాయని, మార్చి 9, 2011తో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని నిర్వాహకులు వివరించారు. ఈ పోటీలో పాల్గొనడానికి 53636 నంబర్‌కు వ్యాగన్ ఆర్ స్పేస్ టిబిఓ అని (WAGON R TBO) ఎస్‌ఎమ్‌ఎస్ పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను వ్యాగన్ ఆర్ స్మార్ట్ ఐడియాస్ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. దశల వారీగా జరిగే ఈ ప్రోగ్రామ్‌లో మే 4, 2011న ఢిల్లీలో గ్రాండ్ ఫైనల్ నిర్వహించి విజేతలను ప్రకటించడం జరుగుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 8, 2011, 16:25 [IST]
English summary
In a bid to increase its sale volume through various marketing strategies Maruti Suzuki is back with the quiz form. The scheme was launched last year to focus and enhance the business modes and the resultant scheme is WagonR Think Big Challenge 2. The winner in this campaign will be entitled to receive Rs10 lakh cash prize in addition to a WagonR car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+