సంక్షోభంలో మారుతీ సుజుకీ

మారుతీ సుజుకీ యాజమాన్యం కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రసక్తే లేదని పట్టుబడు తుండటంతో సమ్మె ఇప్పుడప్పుడే ముగిసే వాతావరణం కనిపించడం లేదు. అయితే యాజమాన్యానికి కార్మికులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు గుర్గాన్ లేబర్ కమీషనర్ జె.పి మన్ నిరంతరం ప్రయత్నీస్తూనే ఉన్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. సమ్మె నిలిపివేయాలంటూ హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సైతం కార్మికులు లెక్క చేయకపోవడంతో భారీ స్థాయిలో పోలీసులు ప్లాంట్ వద్దకు చేరుకున్నారు.
దీంతో పరిస్థితి అంతకంతకూ విషమిస్తోంది. మరోవైపు హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్‌ను అఖిల భారత కాంగ్రెస్ వాణిజ్య సంఘం నాయకులు గురుదాస్ గుప్తా, డి.ఎల్ సచ్‌దేవ్‌లు గత రెండు రోజులుగా ఢిల్లీలో సమ్మె విషయమై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి సైతం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, లేబర్ కమీషనర్‌తో సమస్య పరిష్కారానికై సలహాలు సేకరిస్తున్నారు. కాగా మనెసర్ ప్లాంట్‌లో నెలకొన్న సమ్మె కారణంగా స్విఫ్ట్, ఎ-స్టార్, సీడన్స్ డిజైర్, ఎస్-4 మోడళ్ళ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. మార్కెట్లో ప్రస్తుతం ఈ మోడళ్ళే అధికంగా అమ్ముడవుతుండటంతో మారుతీ వ్యాపారానికి పెద్ద దెబ్బే తగులుతోంది.


Click it and Unblock the Notifications








