దేశంలోనే కాదు గూగుల్ సెర్చ్‌లో కూడా మారుతి నెం.1

Google Auto Report
అంతర్జాల (ఇంటర్నెట్) దిగ్గజం మరియు ప్రముఖ సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్ భారత ఆటోమొబైల్స్ గురించి ఓ తాజా నివేదికను వెల్లడించింది. గూగుల్ విడుల చేసిన "గూగుల్ ఇండియా ఆటో రిపోర్ట్" నివేదికలో అత్యధికంగా శోధించిన (సెర్చ్ చేసిన) ఆటోమొబైల్ కంపెనీల వివరాలను పేర్కొంది. భారత్‌లో ఆటోమొబైల్ రీసెర్చ్ ట్రెండ్‌ల గురించి గూగుల్ తెలిపిన నివేదికలో అత్యధికంగా సెర్చ్ చేసిన కంపెనీల్లో దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ప్రథమ స్థానంలో నిలిచింది.

కాగా.. ఈ నివేదికలో హోండా ద్వితీయ స్థానంలోనూ మరియు హ్యుందాయ్ తృతీయ స్థానంలోనూ నిలిచాయి. గూగుల్ నివేదిక ప్రకారం, భారత ఆటో పరిశ్రమ శరవేగంగా ఎదుగుతోందని తెలుస్తోంది. అంతేకాకుండా కార్లు మరియు బైక్‌లకు సంబంధించిన సమాచారం కోసం భారతీయులే అధికంగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని గూగుల్ పేర్కొంది. భారత్‌లో 65 శాతం మంది ప్రజలు ఆటోమొబైల్స్ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసినట్లు గూగుల్ నివేదిక వెల్లడిస్తోంది. కాగా.. అమెరికా మరియు యూరప్‌లలో కలిపి ఇది 62 శాతంగా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 10, 2011, 18:32 [IST]
English summary
Internet giant, world's largest internet search engine Google released a report on Indian Auto Industry. 'Google India Auto Report' showing a list of most searched automobile companies of the country. In this report, Maruti Suzuki bagged number one slot followed by Honda and Hyundai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+