రూ. 9,000 వరకూ ధరలు పెరిగిన మారుతి సుజుకి కార్లు

Maruti Suzuki
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి తమ కార్ల ధరలను రూ. 9,000 వరకూ పెంచింది. నానాటికీ పెరుగుతున్న ఉత్పాదక వ్యయం కారణంగా ఉత్పత్తుల ధరలు కూడా పెంచక తప్పడం లేదని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కార్ల ధరలను 0.2 శాతం నుంచి 2.4 శాతం మధ్య పెంచామని, ఫలితంగా అన్ని మోడళ్లపై ధరలు కనిష్టంగా రూ. 1100 నుంచి గరిష్టంగా రూ. 9000 వరకూ పెరుగుతాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రస్తుతం మారుతి సుజుకి దేశవ్యాప్తంగా 15 మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 4, 2011 నుండి అమలులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. మారుతి అందిస్తున్న ప్రారంభ మోడల్ మారుతి ఎమ్ 800 (ధర రూ. 1.97 లక్షలు) మొదలుకొని, కంపెనీ తాజాగా విడుదల చేసిన హైఎండ్ వేరియంట్ లగ్జరీ కారు కిజాషి (రూ. 17.5 లక్షల) వరకూ ఈ ధరల పెంపు వర్తిస్తుందని కంపనీ వివరించింది. కాగా.. ఈ ఏడాది మారుతి సుజుకి ధరలను ఇది వరుసగా రెండవసారి.

జనవరి 2011లో కూడా ఆల్టో కారు మినహా మిగిలిన అన్ని కార్ల ధరలను రూ. 8,000 వరకూ కంపెనీ పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాటా మోటార్స్ తమ ఉత్పత్తుల ధరలను ఈ నెల 1 నుంచి రూ. 36,000 వరకూ పెంచగా.. టొయోటా కిర్లోస్కర్ కంపెనీ తమ కార్ల ధరలను రూ. 20,000 వరకూ పెంచింది. వీరి బాటలోనే పయనించేందుకు హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా ధరల పెంపు యోచనలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 6, 2011, 11:32 [IST]
English summary
This is an yet another price rise from the country’s top most carmaker Maruti Suzuki and now the price range is by Rs9000 again due to the rise in input costs. The rise, by 0.2 – 2.4% is applicable to several of its models converting to Rs1100- Rs9000 based on the models said the company.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+