జనవరిలో భారత రోడ్లపైకి రానున్న మారుతి ఎర్టిగా

తొలుత ఆర్-3 కాన్సెప్ట్ పేరుతో అభివృద్ధి చేసిన ఈ 7-సీటర్ ఎమ్‌యూవికు మారుతి సుజుకి ఇటీవలే 'ఎర్టిగా' అనే పేరును ఖరారు చేసింది. మారుతి సుజుకి నుండి అధిక వీల్ బేస్ కలిగిన ఓ పెద్ద వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారి కల త్వరలోనే నిజం కానుంది. ఇప్పటికే మంచి బ్రాండ్ ఇమేజ్‌ను కలిగి ఉన్న మారుతి సుజుకి నుండి వస్తున్న ఇలాంటి ఓ ఎమ్‌యూవీకు తప్పకుండా మార్కెట్ నుండి మంచి ఆదరణ లభించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అత్యంత పోటీతత్వ ధరతో మారుతి సుజుకి ఈ ఎమ్‌యూవీని విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర రూ.6-9 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. 4.2 మీటర్ల పొడవు ఉండనున్న ఈ ఎమ్‌పివి 2740 మి.మీ. వీల్ బేస్‌ను కలిగి ఉండనుంది. ఇందులో 1.3 లీటర్ వేరియబిల్ జియోమెట్రీ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. ఇదే ఇంజన్‌ను ఎస్ఎక్స్4లో కూడా ఉపయోగిస్తున్నారు.


Click it and Unblock the Notifications








