మారుతి సమ్మెను క్యాష్ చేసుకుంటున్న హ్యుందాయ్

Hyundai Eon
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా మానేసర్ ప్లాంటులో నెలకొన్ని కార్మిక అనిశ్చితి కారణంగా కంపెనీ ఇటు ఉత్పత్తి, అటు అమ్మకాలను నష్టపోతుంటే, తన సమీప ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇదే అవకాశాన్ని అదునుగా తీసుకుని కార్ మార్కెట్లో టాప్‌గేర్‌లో దూసుకుపోతుంది. మారుతి సుజుకి మానేసర్ కార్మికుల సమ్మె గుర్‌గావ్‌ ప్లాంట్‌ కూడా పాకుతుండటంతో అక్కడి ప్లాంటులో ఉత్పత్తి కూడా పడిపడిపోయింది.

గుర్‌గావ్ ప్లాంటులో మారుతి సుజుకి నుంచి ప్రపంచంలోనే అత్యధికంగా అమ్మడవుతున్న ఆల్టో కారుతో సహా స్విఫ్ట్ డిజైర్, ఏ-స్టార్, మారుతి 800, ఆమ్నీ, ఈకో వంటి మోడళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కాగా.. ఈ సమ్మె కారణంగా మారుతి సుజుకి ఉత్పత్తి నష్టపోతుండటంతో కొన్ని మోడళ్ల వెయింట్ పీరియడ్ గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా కొనుగోలుదారులు ఇతర పోటీదారులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మారుతి అసహాయతను హ్యుందాయ్ క్యాష్ చేసుకుంటుంది.

మారుతి సుజుకి మానేసర్ కార్మికుల సమ్మె కారణంగా హ్యుందాయ్ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. దీనికితోడు కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన చిన్న కారు హ్యుందాయ్ ఇయాన్‌కు మంచి స్పందన వస్తుందని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ ఆర్‌. సేతురామన్‌ తెలిపారు. హ్యుందాయ్ ఇయాన్ కారుకు ఇప్పటికే 5,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. పెరుగుతున్న బుకింగ్‌ల కారణంగా తమ మార్కెట్ వాటా కూడా క్రమంగా పెరుగుతుందని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 19, 2011, 12:07 [IST]
English summary
Maruti Suzuki's tryst with strikes in the past three months have had a negative impact on India's leading carmaker. This has also helped Maruti's biggest competitor Hyundai to increase sales. Bookings at Maruti started to fall after the strike began at Manesar. At the same time Hyundai has launched the Eon, a competitor of the Alto and has already reported more than 5,000 bookings. Is this the end of the reign for Maruti Suzuki?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+