ఇక బయట తేల్చుకుంటాం..!!

ప్రభుత్వ ఉత్తర్వు మేరకు తాము ప్లాంట్‌నుంచి వెలుపలికి వెళుతున్నామని అయితే తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని ఎస్‌ఎంఐ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ చెప్పారు. అలాగే ఎస్‌పీఐఎల్ కార్మికులు కూడా ప్లాంట్ నుంచి బయటికి వెళ్లిపోయారు. పోలీసులు తమ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని యూనియన్ అధ్యక్షుడు సుబీ సింగ్ యాదవ్ చెప్పారు. అయినా తాము తమ సమ్మెను ప్లాంట్ బయట చేస్తామన్నారు. హర్యానా ప్రభుత్వం ఈ మూడు ప్లాంట్‌లో చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమని హెచ్చరించింది. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ఇక సమ్మె సమస్య పరిష్కార బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఆనంద్ శర్మకు అప్పగించింది. హర్యానా ప్రభుత్వ అధికారులతో తాను ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడానని, అసలు సమస్య ఎక్కడ మొదలైందన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ వివరించారు. ఇది కేవలం హార్యానా రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా తాము భావించడం లేదని ఇది దేశానికి సంబంధించినదని వ్యాఖ్యానించిన ఆయన ప్లాంటు షట్ డౌన్ కారణంగా దేశీయ వాహన పరిశ్రమతో పాటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలు కష్టాల్లో చిక్కుకుంటాయని శర్మ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications








