మానేసర్ ప్లాంటులో తాజా సమ్మె: నిలిచిన ఉత్పత్తి

శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుండి కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికుల వాదన ప్రకారం, ఇది వరకటి సమ్మెలో క్యాజువల్ వర్కర్స్ తమకు మద్దతు తెలిపిన కారణంగానే వారిని విధుల్లోకి తీసుకోలేదని చెబుతున్నారు. కాగా.. యాజమాన్య వాదన ప్రకారం, ఇంకా ప్లాంటులో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కాలేదని, ప్లాంట్-బిలో పూర్తి స్థాయి ఉత్పత్తి చేపట్టిన తర్వాత విడుదల వారీగా వర్కర్లను పనిలోకి తీసుకుంటామని చెబుతోంది.
ఆగస్టు నెల 29న ప్రారంభమైన సమ్మె నిరవధికంగా 33 రోజుల పాటు జరిగి గత సోమవారమే ముగిసింది. ఇప్పుడిప్పుడే మానేసర్ ప్లాంటులో పుంజుకున్న ఉత్పత్తి జోరుకు తాజా సమ్మె బ్రేకులు పడేలా చేసింది. మరి ఈ తాజా సమ్మె ఎపప్పుడు ముగుస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








