జిఎమ్‌లో ముగిసింది.. ఎమ్ఎస్ఐలో ప్రారంభమైంది..!

Maruti Suzuki
జనరల్ మోటార్స్ ఫ్యాక్టరీలో సమ్మె సద్దుమణిగగానే మారుతి సుజుకి ఫ్యాక్టరీలో సమ్మె ప్రారంభమైంది. మనేసార్‌లోని తమ ప్లాంటులో కొందరు కార్మికులు శనివారం సమ్మెకు దిగినట్లు మారుతీ సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) తెలిపింది. అయితే ఈ సమ్మెకు ఎలాంటి కారణాలు లేవని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. కార్మికుల సమ్మెకు సంబంధించి కార్మిక నాయకులతో మాట్లాడుతున్నామని స్పష్టం చేసింది. అయితే కార్మిక వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త యూనియన్‌ను గుర్తించాలన్నది వారి డిమాండ్‌లలో ఒకటి.

అయితే ఈ సమ్మె కారణంగా కంపెనీ ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాన్ని మాత్రం మారుతి సుజుకి యాజమాన్యం వెల్లడించలేదు. దాదాపపు 2,000 మంది కార్మికులు పని చేస్తున్న మానేసర్‌ ప్లాంట్‌లో ఇటీవలే కొత్తగా ఏర్పడిన ఉద్యోగ సంఘానికి కంపెనీ యాజమాన్యం సరైన గుర్తింపును ఇవ్వకపోతుండటం వల్లనే కార్మికులు సమ్మెకు దిగినట్లుగా భావిస్తున్నారు. మానేసర్‌ ప్లాంట్‌ ద్వారా కంపెనీ సాలీ 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా.. ఈ ప్లాంటు మరో రెండు కొత్త యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, June 5, 2011, 12:01 [IST]
English summary
After the General Motrors Halol plant strike, Now country's largest carmaker Maruti Suzuki India (MSI) production at the Manesar plant was adversely affected on Saturday afternoon after nearly a thousand employees went on strike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+