ఫ్రాంక్‌ఫర్ట్‌లో మెరిసిన మాసేరటి కుబాంగ్ ఎస్‌యూవీ

ఈ పేరు వినగానే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా సంచల విజయం సాధించిన బ్లాక్‌బస్టర్ మూవీ "దబాంగ్" సినిమా గుర్తుకురాక మానదు. సరే ఆ విషయం అటుంచితే.. మాసరేటి కుబాంగ్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను తొలుత 2003లోనే న్యూయార్క్ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. ఇది ప్రొడక్షన్ వెర్షన్ అయి ఉండొచ్చని, అతి త్వరలోనే మార్కెట్‌లోకి రావచ్చని అంచనా.
స్టైల్, ఇంజన్, సస్పెన్షన్, బ్రేక్స్, హ్యాండ్లింగ్ మరియు పెర్ఫామెన్స్ విషయంలో తమ ఎస్‌యూవీ మెరుగ్గా రాణిస్తుందని, అత్యంత స్పోర్టీ లుక్‌తో విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారి కోసం దీన్ని డిజైన్ చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కుబాంగ్ ఎస్‌యూవీ అత్యంత శక్తివంతమైన ఇంజన్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతకు మించి వివరాలను కంపెనీ వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించింది.


Click it and Unblock the Notifications








