చెన్నైలో మాసేరటి లగ్జరీ కారును సీజ్ చేసిన అధికారులు

ఈ కారును ఓ ఎన్ఆర్ఐ తమిళనాడులోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడికి బహుమతిగా ఇచ్చినట్లు గసుగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించేందుకు నిరాకరిస్తున్నారు.
ఇటలీలో తయారైన తెలుపు రంగు మాసేరటి కారును 2008లో ముంబై పోర్టులో దిగుమతి చేసుకున్నారు. తర్వాత అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు విక్రయించారు. అండర్‌వ్యాల్యూ చేసిన ఆ వాహనాన్ని ట్రేస్ చేయాల్సిందిగా అహ్మదాబాద్ అధికారులు తమను కోరారని, ఈ నేపథ్యంలో సోమవారం తమ ఇంటెలిజెన్స్ టీమ్ వెస్ట్ మాంబళంలో ఆ లగ్జరీ కారు సీజ్ చేశారని డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. ఈ కారుపై ఇంకా అదనంగా రూ. 60 లక్షల కస్టమ్ డ్యూటీని చెల్లించాలని ముంబై కస్టమ్స్ మరియు డిఆర్ఐ అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications








