భారత్‌లోకి పునఃప్రవేశించిన మెర్సిడెస్-బెంజ్ మేబాచ్ లగ్జరీ కార్

తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన గతేడాది ధనికుల జాబితాలో అదనంగా 17 మంది కోటీశ్వరులు చేరారు, దీంతో భారత్‌లో అత్యంత ధనికుల సంఖ్య 69 పెరిగింది. మేబాచ్‌ను భారత్‌లో మొట్టమొదటిసారిగా 2004లో ప్రవేశపెట్టారు. అప్పట్లో దాని ధర రూ. 5 కోట్లుగా ఉంది. ప్రపంచ మార్కెట్లో మెర్సిడెస్ మేబాచ్ బ్రాండ్‌తో ఉన్న మేబాచ్ 57ఎస్, మేబాచ్ 62 అనే రెండు మోడళ్లలో 200 కార్లను కంపెనీ విక్రయించింది. చైనా మార్కెట్లో 20 మేబాచ్ కార్లను మెర్సిడెస్ విక్రయించనుంది. కానీ భారత మార్కెట్లో ఇంత వరకూ కంపెనీకి ఎలాంటి నిర్థిష్ట విక్రయ లక్ష్యం లేదు.
మేబాచ్‌ను తిరిగి కొత్త డిజైన్‌తో 21వ శతాబ్దానికి అనువుగా ఉండే సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పీటర్ హోంగ్ తెలిపారు. "మేబాచ్ 57 ఎస్" మోడల్ కారు 5980 సీసీ ఇంజన్ సామర్థ్యంతో లభిస్తుంది. ఇది గంటకు 275 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇకపోతే "మేబాచ్ 62" మోడల్ కారు 5513 సీసీ ఇంజన్ సామర్థ్యంతో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాగా ఈ విభాగంలో వోల్క్స్‌వ్యాగన్ బెంట్లీ, బిఎమ్‌డబ్ల్యూ రోల్సో రాయిస్ కార్లతో మెర్సిడెస్ మేబాచ్ పోటీపడాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








