జనవరి-ఆగస్టు 2011 మధ్యకాలంలో బెంజ్ సేల్స్ 40% జంప్

దాదాపు దశాబ్ధానికి పైగా భారత లగ్జరీ కార్ మార్కెట్లో అమ్మకాల సంఖ్య పరంగా నెంబర్ వన్‌గా నిలిచిన మెర్సిడెస్ బెంజ్‌ను జర్మనీకే చెందిన మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ గడచిన కొద్ది నెలలుగా అధిగమిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో బిఎమ్‌డబ్ల్యూ జోరుకు కళ్లెం వేసేందుకు మెర్సిడెస్ బెంజ్ ఇటీవలే కార్ రీటైల్ లీజింగ్ వ్యాపారంలోకి కూడా ప్రవేశించింది. దీని ద్వారా లగ్జరీ కార్ మార్కెట్లో అధిక మార్కెట్ వాటా ఆర్జించగలమని కంపెనీ ఆశాభావంతో ఉంది.


Click it and Unblock the Notifications








