బుగాటి 'వేరాన్'కు పోటీగా మెక్‌లారెన్ 'మెగా మ్యాక్'

ప్రస్తుతం బుగాటి అందిస్తున్న అత్యంత వేగవంతమైన కారు 'వేరాన్' వేగాన్ని తలదన్నేలా మెక్‌లారెన్ ఓ హైపర్ కారును అభివృద్ధి చేస్తుంది. బుగాటి వేరాన్ గరిష్టం వేగం గంటకు 430 కిలోమీటర్లకు పైమాటే. మెక్‌లారెన్ అభివృద్ధి చేస్తున్న ఈ హైపర్ కారుకు 'మెగా మ్యాక్' అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మెక్‌లారెన్ ఈ మెగా మ్యాక్ సూపర్ కారును ట్రాక్ టెస్టింగ్ కూడా చేస్తోంది. త్వరలోనే ఇది రోడ్లపై రానుంది.
మెక్‌లారెన్ అందిస్తున్న సూపర్ కార్ 'ఎఫ్1' ఆధారంగా చేసుకొని ఈ కారును డిజైన్ చేశారు. ఇందులో 5-లీటర్ ఇంజన్ అమర్చారు. ఇది 800 బిహెచ్‌పిల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు బరువును తగ్గించి, తద్వారా వేగాన్ని పెంచేందు కోసం బాడీ నిర్మాణంలో కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించారు. దీని ధర ఒక లక్ష బ్రిటన్ పౌండ్లకు పైమాటే.


Click it and Unblock the Notifications








