67 శాతం పెరిగిన మెర్సిడెస్ బెంజ్ ఏప్రిల్ విక్రయాలు

Mercedes-Benz
ప్రముఖ ప్రిమీయం కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఏప్రిల్ విక్రయాలు భారీగా పెరిగాయి. గతేడాది ఏప్రిల్ నెల విక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నెల విక్రయాలు 67 శాతం పెరిగి 537 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ 2010లో ఈ విక్రయాలు కేవలం 321 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రిమీయం ఉత్పత్తులను ఇష్టపడే వినియోగదారుల సంఖ్య పెరుగుతోందని, మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ మరియు ఉత్పత్తులను వినియోగదారుల ఎక్కువగా ఆదరిస్తున్న కారణంగానే ఈ వృద్ధిని సాధించగలిగామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పీటర్ టి హానెగ్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా.. ఈ ఏప్రిల్ విక్రయాలలో సి-క్లాస్ కార్లు 72 శాతం వృద్ధిని నమోదు చేసుకొని 253 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి 147 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఈ-క్లాస్ కార్లు 42 శాతం పెరిగి 178 కార్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 2010లో ఇవి 125 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఎమ్-క్లాస్ వాహనాలు ఏప్రిల్ 2011లో 50 యూనిట్లు అమ్ముడు కాగా, ఏప్రిల్ 2010లో కేవలం 10 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. జనవరి-ఏప్రిల్ 2011 కాలానికి గానూ బెంజ్ మొత్తం 2,670 వాహనాలను విక్రయించి 67 శాతం పెరుగుదలను కనబరిచింది. గతేడాది ఇదే సమయంలో ఇవి 1,603 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Thursday, May 5, 2011, 10:34 [IST]
English summary
German Luxury carmaker Mercedes-Benz India, April sales jump 67% to 537 units as against 321 units in the year ago period. During January-April 2011, the luxury car maker posted a 67% growth to 2,670 units as against 1,603 units in the same period last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+