ఏ-క్లాస్, బి-క్లాస్ కార్లను కూడా భారత్‌కు తీసుకురానున్న బెంజ్

Mercedes Benz A
జర్మనీకు చెందిన ప్రముఖ ప్రిమీయం కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో తమ ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించుకోవాలని సన్నాహాలు చేస్తుంది. ఇప్పటి వరకూ భారత్‌లో లగ్జరీ కార్లను మాత్రమే విక్రయిస్తూ వస్తున్న బెంజ్ త్వరలోనే కాంపాక్ట్ కార్లను కూడా ప్రవేశపెట్టనుంది. కార్ మార్కెట్లో పోటీని ఎదుర్కునేందుకు మరో రెండు మూడేళ్లలో ఏ-క్లాస్, బి-క్లాస్ కార్లను ప్రవేశపెట్టనున్నామని మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. గడచిన 15 ఏళ్లుగా భారత్ లగ్జరీ మార్కెట్‌ను ఏలిన బిఎమ్‌డబ్ల్యూ కారణంగా గతేడాది వరుసగా మూడోసారి తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. 2010లో మెర్సిడెస్ బెంజ్ కేవలం 5,819 కార్లను మాత్రమే విక్రయిస్తే, బిఎమ్‌డబ్ల్యూ మాత్రం 6,246 కార్లను విక్రయించింది.

ఈ అంశంపై మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ హానెగ్ స్పందిస్తూ.. భారత్‌లో తమకు ఎక్కువ అసెంబ్లింగ్ చేసిన ఉత్పత్తులు లేవని, ప్రస్తుత సమయంలో తమ పోటీదారులతో పోటీ పడేందుకు ఇక్కడ తాము అందిస్తున్న ఉత్పత్తుల శ్రేణి సరిపోవడం లేదని, అందుకే ఇక్కడ ఏ-క్లాస్, బి-క్లాస్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని, అంతేకాకుండా వాటిని భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయనున్నట్లు ఆయన వివరించారు. బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న ఎక్స్1 వంటి మోడల్ ధరల శ్రేణిలో బెంజ్ కార్లు ఇక్కడ లేవని ఆయన చెప్పారు. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ను కంపెనీ చెన్నయ్‌లోని ప్లాంటులో అసెంబ్లింగ్ చేస్తుంది, దీని ధర రూ. 22.4 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.

పూణేలోని ప్లాంటులో మెర్సిడెస్ బెంజ్ ఇండియా కంపెనీ సి, ఈ, ఎస్ క్లాస్ లగ్జరీ సెడాన్లను అసెంబ్లింగ్ చేస్తుంది. రెండు షిఫ్టులలో నడిచే ఈ ప్లాంటులో ఏటా 10,000 కార్లను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ అందిస్తున్న అతి చవకైన కారు సి-క్లాస్, దీని ప్రారంభ ధర రూ. 25.48 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇక ఈ-క్లాస్, ఎస్-క్లాస్ కార్ల విషయానికి వస్తే వీటి ప్రారంభ ధరలు రూ. 39.7 లక్షలు మరియు 84.34 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)లుగా ఉన్నాయి. అంటే త్వరలోనే మెర్సిడెస్ బెంజ్‌లో తక్కువ ధరకే బ్రాండెడ్ కార్లు లభించనున్నాయన్నమాట. మరి బెంజ్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి భారత లగ్జరీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని దక్కించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, May 4, 2011, 14:09 [IST]
English summary
Luxury carmaker Mercedes-Benz India is planning to introducing its A and B Class cars in the country within two to three years, to take on competition. Peter Honegg, managing director, Mercedes-Benz India, said, “We do not have enough locally assembled products in India. My current portfolio does not allow me to compete with my competitors at this time. We are going to introduce the A and B Class cars here; we have to assemble these locally to bring in volumes.”
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+