ప్రధమార్థంలో ప్రోత్సాహకర ప్రతిభ: మెర్సిడెస్ బెంజ్

అలాగే, గడచిన నెల విక్రయాలలో మెర్సిడెస్ బెంజ్ ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచింది. జూన్ 2011లో కంపెనీ విక్రయాలు 46 శాతం వృద్ధిని సాధించి 565 యూనిట్లను విక్రయించింది. జనవరి - జూన్ 2011 కాలంలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన సి-క్లాస్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఈ సమయంలో సి-క్లాస్ కార్లు 88 శాతం వృద్ధితో 1,746 యూనిట్లు అమ్ముడయ్యాయి (జనవరి-జూన్ 2011లో ఇవి 928 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి). ఇకపోతే ఈ-క్లాస్ కార్లు 25 శాతం వృద్ధితో 1328 యూనిట్లు, పాపులర్ ఎస్‌యూవీ ఎమ్ఎల్-క్లాస్ వాహనాలు 250 శాతం వృద్ధితో 327 యూనిట్లు మరియు జిఎల్-క్లాస్ 102 శాతం వృద్ధితో 97 యూనిట్లు అమ్ముడయ్యాయి.


Click it and Unblock the Notifications








